kntv
kntv

కొద్దిపాటి వర్షానికి పొంగి పొర్లిన డ్రైనేజీ....

4 weeks ago

 కంచికచర్ల పట్టణంలో మంగళవారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి సత్రం బడి వెళ్లే రహదారి బురదమయంగా మారింది. దీంతో అటుగా రాకపోకలు సాగించే పాదచారులు, వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై మురుగు నీరు, బురద పేరుకుపోవడంతో ప్రయాణం కష్టతరంగా మారిందని స్థానికులు తెలిపారు.