kntv
kntv

బొక్కా నాగరాజుకు కీలక బాధ్యత

1 month ago

పెదముక్క: జాతీయ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ఎస్సీ యువజన విభాగం అధ్యక్షుడిగా బొక్కా నాగరాజు నియమితులయ్యారు. రైతులు, మహిళా రైతులు, యువత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంక్షేమ పథకాలు, రాయితీలు, సబ్సిడీలపై అవగాహన కల్పిస్తానని తెలిపారు. యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తానన్నారు.