kntv
kntv

కుడి భుజానికి చికిత్స.. కేరళ చేరుకున్న పవన్ కళ్యాణ్

1 month ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ చేరుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స కోసం త్రిస్సూర్ సమీపంలోని ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ చేయించుకోనున్నారు. శనివారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా వైద్యశాలకు బయలుదేరారు.