శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Repuru Jana Sena President Nakka Srinivas: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ప్రతిరూపం – రేపూరు జనసేన అధ్యక్షుడు నక్కా శ్రీనివాస్

    1 week ago

    కాకినాడ (తొలి ఉదయం): మన ఊరు – నా బాధ్యత అనే నినాదంతో రేపూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు నక్కా శ్రీనివాస్ స్వయంనిధులతో సుమారు రూ.13 లక్షలు వెచ్చించి గ్రామ ప్రజలకు ఉచితంగా మంచినీటి సరఫరా వాహనాన్ని అందజేయడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఈ వాహనాన్ని ఆయన స్వయంగా ప్రారంభించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను జనసైనికులు ఆచరణలో పెడుతున్నారనడానికి నక్కా శ్రీనివాస్ జీవంత ఉదాహరణగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం గర్వకారణమన్నారు.

    రేపూరు గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, గోశాల, గృహనిర్మాణ పనులు, 360 విద్యుత్ ఫోల్స్ ఏర్పాటు, జలజీవన్ పథకానికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల కేటాయింపు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయం అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 35 మోడల్ స్కూళ్లు, 3 హై స్కూళ్లు మంజూరు చేయడం, 200 మందికి సీఎం రిలీఫ్ అందించడం జరిగిందని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం వల్ల జాప్యాలు జరిగినా, రానున్న రోజుల్లో అన్ని గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బండారు మురళి, శిరంగు శ్రీనివాస్, తోట వేణు, గవర శ్రీరాములు, వల్లూరి రాజా, పెండెం కృష్ణ, అడపా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Peppa Pig’s latest episode has parents in tears - here’s what happens to George
    తర్వాత ఆర్టికల్
    IND vs USA LIVE: All eyes on SKY as India look for strong finish

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి