శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    RoadDevelopment : రూ.2.44 కోట్లతో ఐదు రోడ్లకు మంజూరు – అభివృద్ధి పనులకు శ్రీకారం

    1 hour ago

    అవనిగడ్డ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రూ.2.44 కోట్లతో ఐదు ప్రధాన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె పండుగ–2.0 కార్యక్రమంలో ఈ పనులు చేపట్టనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

    మోపిదేవి మండలంలో మోపిదేవి–వెంకటాపురం ప్రధాన రహదారి 0.0 కిమీ నుంచి 2.0 కిమీ వరకు రూ.48 లక్షలు, 2.0 కిమీ నుంచి 3.9 కిమీ వరకు రూ.49 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 3.9 కిలోమీటర్ల రహదారికి రూ.97 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే వివరించారు. అలాగే జాతీయ రహదారి–216 నుంచి కొక్కిలిగడ్డ వెళ్లే ప్రధాన రహదారికి రూ.49 లక్షలు మంజూరయ్యాయి.

     

    చల్లపల్లి మండలంలో నడకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని రాముడుపాలెం గ్రామ ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.49 లక్షలు, నాదెళ్లవారిపాలెం రహదారికి రూ.49 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగవడంతో పాటు స్థానిక ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘Who’s your best XI?’: Ponting warns India to return to ‘basics’ or risk T20 WC exit
    తర్వాత ఆర్టికల్
    Rashmika Mandanna's ‘cheat day’ meals

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి