శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Social Media War Between Raghu Rama and Sunil Kumar : రఘురామ–సునీల్ కుమార్ మధ్య సోషల్ మీడియా వార్ వేడెక్కింది

    1 hour ago

    ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి Raghu Rama Krishna Raju మరియు సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి PV Sunil Kumar మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం ముదిరింది. సామాజిక, ప్రసార మాధ్యమాల్లో ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల క్రీడాపోటీల్లో క్రికెట్ ఆడుతూ రఘురామ కిందపడి గాయపడగా, ఆయన చేతి మణికట్టుకు గాయం కావడంతో కట్టుతోనే అసెంబ్లీకి హాజరయ్యారు.

     

    ఈ ఘటనపై సునీల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “రఘురామ.. కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగాయి. నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా?” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనికి రఘురామ దీటుగా బదులిస్తూ, “సర్వీస్ కాల సస్పెన్షన్‌లో ఉన్న సునీల్ కుమార్ అనుమతిస్తే నాకు అరగంట చాలు.. కస్టడీలో నన్ను హింసించినట్టుగా కాళ్లు కట్టేసి పాదాలపై కర్ర, రబ్బర్ బెల్ట్‌తో రక్తపు చారలు పడేలా కొట్టగలను. బహిరంగంగా నిరూపించడానికి సిద్ధం” అని సవాల్ విసిరారు.   ఇదే సమయంలో న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని రఘురామ స్పష్టం చేశారు. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Amid US-Israel strikes, Iran captain wants World Cup qualification
    తర్వాత ఆర్టికల్
    How Rana Daggubati built a multi-sector empire

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి