శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Stanford University శాస్త్రవేత్తల కొత్త నాసికా స్ప్రే సంచలనం

    3 గంటలు క్రితం

    సీజన్ మారిందంటే జలుబు, అలర్జీలు ఇంటింటికీ పాకడం సాధారణమే. కానీ ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం దొరకొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని Stanford University పరిశోధకులు ఒక వినూత్న ‘మ్యాజికల్ నాసికా స్ప్రే’ను అభివృద్ధి చేశారు. ఇది సాధారణ టీకాల్లా ఒక్కో వ్యాధికి మాత్రమే కాకుండా, ఫ్లూ, కోవిడ్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, డస్ట్ అలర్జీల వరకు రక్షణ కల్పించే “సార్వత్రిక టీకా”గా పనిచేస్తుందని తెలిపారు.

    ఈ స్ప్రే ముక్కులో వేసుకున్న వెంటనే శరీరంలోని మాక్రోఫేజెస్ అనే తెల్ల రక్త కణాలను అలర్ట్ మోడ్‌లోకి పంపించి, వైరస్‌లను వేగంగా ఎదుర్కొనేలా చేస్తుంది. జంతువులపై చేసిన పరీక్షల్లో వైరస్ ప్రభావం వెయ్యి రెట్లు తగ్గినట్లు గుర్తించారు. ఒక్కసారి వాడితే మూడు నెలల వరకు రక్షణ కల్పించే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. త్వరలోనే మనుషులపై పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరిశోధన విజయవంతమైతే భవిష్యత్తులో జలుబు, శ్వాసకోశ సమస్యలు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'The Dreadful': Sophie Turner and Kit Harington react to their hilariously awkward kiss
    తర్వాత ఆర్టికల్
    From Ishan Kishan to Yuvraj Samra: The heroes of the T20 World Cup group stage

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి