శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Vijay Deverakonda wed's Rashmika Mandanna : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా వివాహ వేడుక: ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి

    1 hour ago

    టాలీవుడ్ స్టార్ హీరో Vijay Deverakonda మరియు నేషనల్ క్రష్ Rashmika Mandanna త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ బంధాన్ని పెళ్లి రూపంలో అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

    వివాహ వేదిక వివరాలు

    వీరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఉదయ్‌పూర్‌ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ITC Mementos రిసార్ట్‌లో ఈ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన రిసార్ట్ ప్రశాంతత, గోప్యత, భద్రత కారణంగా ప్రముఖ సెలబ్రిటీల వివాహాలకు అనువైన వేదికగా గుర్తింపు పొందింది.

    ఈ రిసార్ట్‌లో ఒక రోజు గడపాలంటే రూమ్ ధరలు సుమారు రూ.26,000 నుంచి ప్రారంభమవుతాయి. వ్యాలీ వ్యూ విల్లా ధర సుమారు రూ.26,000 ఉండగా, ఆరావళి సూట్స్ ధర రూ.55,000 వరకు ఉంటుంది. అత్యంత విలాసవంతమైన మెమెంటోస్ సూట్స్ రాత్రికి రూ.75,000 నుంచి రూ.91,000 వరకు ఖర్చవుతాయని సమాచారం.

    పెళ్లి విశేషాలు

    వీరి వివాహ వేడుకకు ఇప్పటికే రెండు కుటుంబాలు, సన్నిహితులు ఉదయ్‌పూర్ చేరుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థానీ సంస్కృతి, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా ఈ వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోప్యత, భద్రత ప్రధాన కారణాలుగా ఈ లొకేషన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

    ఈ వివాహంపై రోజుకో కొత్త వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ఈ జంట కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Manisha Koirala praises Bhansali’s devotion in birthday note
    తర్వాత ఆర్టికల్
    Chandrasekaran Tenure Extension: Why Tata Sons chairman asked board to defer discussion - explained

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి