శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    akhanda 2 postponed : బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా: సోషల్ మీడియా రూమర్లకు చెక్ పెట్టిన సురేశ్‌ బాబు

    1 month ago

    ఇంటర్నెట్ డెస్క్:  నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘అఖండ 2: తాండవం’ విడుదల అనూహ్యంగా వాయిదా పడటంతో సోషల్ మీడియాలో ఎన్నో రకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే చివరకు నిర్మాత సురేశ్ బాబు స్వయంగా స్పందించి, ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు. సురేశ్ బాబు మాట్లాడుతూ, వాయిదాకు పూర్తిగా ఆర్థికపరమైన కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. “డబ్బుల విషయాలు బయట చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా చూడటం ముఖ్యమైన విషయం. పుకార్లను నమ్మవద్దు” అని క్లారిటీ ఇచ్చారు.

     

    ఇండస్ట్రీలో ఇలాంటి ఫైనాన్స్ ఇష్యూలు కొత్తేమీ కావని, వాటిని చర్చల ద్వారా సులభంగా పరిష్కరించవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మరియు ఫైనాన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య సెటిల్‌మెంట్ చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అన్నీ సర్దుకున్న వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో నడుస్తున్న రూమర్లకు సురేశ్ బాబు పూర్తిగా చెక్ పెట్టినట్టైంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    mriti mandhana first post after wedding : స్మృతి మంధాన–పలాశ్ ముచ్చల్‌ పెళ్లి వాయిదా… రింగ్‌ లేకుండా కనిపించిన వీడియోపై కొత్త చర్చ
    తర్వాత ఆర్టికల్
    Ram Gopal Varma As Showman : ‘షో మ్యాన్’లో హీరోగా రామ్ గోపాల్ వర్మ?

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి