శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    mriti mandhana first post after wedding : స్మృతి మంధాన–పలాశ్ ముచ్చల్‌ పెళ్లి వాయిదా… రింగ్‌ లేకుండా కనిపించిన వీడియోపై కొత్త చర్చ

    1 నెల క్రితం

    ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన మరియు సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురవడంతో అనూహ్యంగా వాయిదా పడింది. అదే సమయంలో పలాశ్ కూడా అస్వస్థత చెందినట్లు తెలిసింది. ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కొత్త పెళ్లి తేదీపై ఇరువురి కుటుంబాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

     

    ఇన్‌స్టాగ్రామ్‌లో స్మృతి కొత్త పోస్ట్ — ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించకపోవడంతో చర్చులకు ఊపిరి

    పెళ్లి వాయిదా అనంతరం స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పెయిడ్ ప్రమోషన్ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. దీంతో  ఈ షూట్ నిశ్చితార్థానికి ముందు చేశారా? తర్వాత చేశారా?  అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే, ఇవన్నీ సోషల్ మీడియా ఊహాగానాలేనని, ఇరువురు కుటుంబాలు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని చెప్పుకోవాలి.

     

    పెళ్లి వాయిదా తరువాత డిలీట్ చేసిన ఫోటోలు — రూమర్లకు మరింత ఊపు

    స్మృతి మంధాన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లి వేడుకల ఫోటోలు, వీడియోలను తొలగించడం, అలాగే ఆమె స్నేహితులు శ్రేయాంక పాటిల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా తమ ఖాతాల్లో చేసిన పోస్టులను తీసేయడం… ఇవన్నీ సోషల్ మీడియాలో కొత్త రూమర్లకు కారణమయ్యాయి. కొన్ని పేజీలు పెళ్లి రద్దు అనే నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయడం మొదలుచేశాయి. అయితే ఇవి అధికారికంగా ధృవీకరించబడని సమాచారం మాత్రమే.

     

    వైరల్ చాట్‌లు – వివాదం – కుటుంబాల స్పష్టత

    పలాశ్ ముచ్చల్‌కు సంబంధించిన ఒక అస్పష్టమైన, ధృవీకరించని చాట్ ఆన్లైన్లో వైరల్ కావడంతో రూమర్లకు మరింత ఊతం లభించింది. ఈ నేపథ్యంలో స్మృతి సోదరుడు మరియు పలాశ్ సోదరి పెళ్లి వాయిదా పడిందిగానీ రద్దు కాలేదని స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.  స్మృతి మంధాన మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా అనేక పోస్టులు పెడుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Heroine Meenakshi Chaudhary : ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిన మీనాక్షి చౌదరి – వరుస హిట్స్‌తో క్రేజీ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న స్టార్ బ్యూటీ
    తర్వాత ఆర్టికల్
    akhanda 2 postponed : బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా: సోషల్ మీడియా రూమర్లకు చెక్ పెట్టిన సురేశ్‌ బాబు

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి