శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ram Gopal Varma As Showman : ‘షో మ్యాన్’లో హీరోగా రామ్ గోపాల్ వర్మ?

    1 month ago

    ఇంటర్నెట్ డెస్క్: నిజ జీవితంలో ‘షో మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు అదే పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారన్న వార్తలు ఫిలింనగర్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ‘ఐస్ క్రీమ్’, ‘ఐస్ క్రీమ్ 2’ సినిమాల తర్వాత వర్మతో మరోసారి ఆయన జోడీ కడుతున్నారు. ఈ సినిమాతో నూతన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్మతో ఉన్న తన అనుబంధం కారణంగా ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి ‘షో మ్యాన్’ను నిర్మిస్తున్నానని, ఇది తన 120వ సినిమా అని నిర్మాత రామ సత్యనారాయణ తెలిపారు.

     

    ‘షో మ్యాన్’లో ప్రతినాయకుడిగా నటుడు సుమన్ కనిపించనున్నారు. దశాబ్దాల పాటు హీరోగా రాణించిన సుమన్, రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలో విలన్ పాత్రతో మరో కోణాన్ని చూపించారు. అప్పటి నుంచి అడపాదడపా ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. అదే తరహాలో, రామ్ గోపాల్ వర్మ హీరోగా నటిస్తుండగా సుమన్ విలన్‌గా కనిపిస్తారని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా ట్రైలర్ విడుదల చేసి, తరువాత రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు.

     

    ఇదిలా ఉండగా, ఈ సినిమాలో తాను అసలు నటించడం లేదని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఖండించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పష్టం చేస్తూ, “ఈ ప్రాజెక్ట్‌లో నేను నటిస్తున్నానని ప్రచురితమైన సమాచారం తప్పు” అని చెప్పారు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించాల్సి ఉండగా, మధ్యలో ప్రాజెక్ట్‌లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు అదే రికార్డ్ మళ్లీ రిపీట్ అయినట్లు కనిపిస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    akhanda 2 postponed : బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా: సోషల్ మీడియా రూమర్లకు చెక్ పెట్టిన సురేశ్‌ బాబు
    తర్వాత ఆర్టికల్
    Regression of young Indian cricketers : భారత యువ క్రికెటర్ల దూకుడు: వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, అభిషేక్ శర్మ సంచలనాలు

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి