శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mana Shankar Varaprasad Garu : సంక్రాంతి బ్లాక్‌బస్టర్ : చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’లో మళ్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

    1 నెల క్రితం

    మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడినాయి. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఆసక్తికర వివరాలను పంచుకున్నారు.

     

    డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “చిరంజీవి గారు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇది ఆయనకు ఇష్టమైన జానర్. గతంలో ఇలాంటి కథలతో ఆయన సాధించిన బ్లాక్‌బస్టర్లను మనందరికీ తెలుసు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి గారు అందరిని సర్‌ప్రైజ్ చేయడం ఖాయం” అని అన్నారు.

     

    ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. అనిల్ రావిపూడి ప్రకారం, త్వరలో మరొక పాటను కూడా విడుదల చేయనున్నారు. చిత్రీకరణ పూర్తయ్యాకే ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రత్యేక కాస్టింగ్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. సంక్రాంతి రిలీజ్‌గా ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం నిలవనుందని అంచనా వేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Jali Sarees The Stunning Fashion Trend : జాలీ చీరల హంగులో సెలబ్రిటీలు మెరిసి మురిసిపోతున్నాయి: 2025 ఫ్యాషన్ ట్రెండ్
    తర్వాత ఆర్టికల్
    Virat Kohli : టెస్టు జట్టును బలపరిచేందుకు కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభం

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి