శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    TTD Pournami Garuda Seva : తిరుమలలో వైభవంగా గరుడసేవ, బ్రహ్మోత్సవాల ఘన ముగింపు

    1 hour ago

    తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. 108 వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత పవిత్రంగా భావించే ఈ గరుడసేవ, స్వామివారి దాసానుదాస భావాన్ని భక్తులకు బోధిస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

    తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగిన తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణ ఘట్టంతో ఘనంగా ముగిశాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గరుడ పటాన్ని అవనతం చేసి దేవతలను శాస్త్రోక్తంగా సాగనంపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించిన భక్తులు సమస్త పాపాల నుండి విముక్తి పొంది ఆయురారోగ్యాలు, సుఖసంపదలను పొందుతారని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

    అదే విధంగా నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు దివ్యంగా దర్శనమిచ్చారు. “సర్వభూపాలుడు” అంటే సమస్త రాజులకు అధిపతి అయిన భగవంతుడు అనే సనాతన సందేశాన్ని ఈ వాహనసేవ తెలియజేస్తుంది. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock Market Live Updates Today: BSE Sensex opens over 400 points up, Nifty50 above 23,600; crude oil prices rise 2%
    తర్వాత ఆర్టికల్
    Virat dances the night away with Anushka - WATCH

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి