kntv
kntv

లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్....

1 day ago

కంచికచర్ల పట్టణ శివారు పేరకలపాడు వద్ద ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆనుకొని వెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు.