శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Shaari movie actress Aaradhya Devi : సినిమా విడుదల కాకముందే సంచలనం – హాట్ టాపిక్‌గా ఆరాధ్యదేవి

    1 month ago

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్‌కు ఎప్పుడూ కొరత ఉండదు. ప్రతి సినిమా వచ్చేటప్పుడూ ఒక కొత్త అందం ప్రేక్షకులను పలకరించడం సాంప్రదాయమే. ఇప్పటికే ఇతర భాషల నుంచి అనేక భామలు టాలీవుడ్‌లో స్థానం దక్కించుకుంటూ క్రేజ్ సంపాదిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే పేరే వినిపిస్తోంది  ఆరాధ్యదేవి.

     

     కొత్త హీరోయిన్‌లు మార్కెట్‌లోకి వచ్చినా, సినిమా రిలీజ్ కాకముందే ఇలా వైరల్ అవడం అరుదు. కానీ ఆరాధ్యదేవి మాత్రం: మొదటి సినిమా కూడా విడుదల కాకముందే భారీ ఫాలోయింగ్ .  సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్‌కి అద్భుత స్పందన కుర్రకారుకు కొత్త క్రష్‌గా మారిన స్థాయి ఇంత క్రేజ్‌తో ఆమె ప్రస్తుతం టాలీవుడ్ చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది.

     

    ఆరాధ్యదేవి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. 23 ఏళ్ల ఈ యువతిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గుర్తించాడు. ఆమె రూపం, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఇంప్రెస్ అయిన వర్మ: ఆమెను సంప్రదించాడు. హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించాడు . "పేటి శారీ" అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. సోషల్ మీడియా నుంచి నేరుగా సినీ హీరోయిన్‌గా వచ్చిన అరుదైన ఉదాహరణల్లో ఆరాధ్యదేవి ఒకరు.

     

    ఇన్‌స్టాలో పద్దతిగా చీర కట్టులో కనిపించే ఆరాధ్య, ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. నెటిజన్స్ కూడా ఆమె ఈ మార్పు చూసి షాక్ అవుతున్నారు. గతంలో ఆరాధ్య ఇలా చెప్పింది. "ఎలాంటి పాత్ర వచ్చినా చేయడానికి రెడీ .గ్లామర్ రోల్స్ చేయకుండా ఉండాలని అనుకున్నాను. ఇప్పుడేమో అభిప్రాయం మారింది" అని స్పష్టంగా వెల్లడించింది. అంటే, స్క్రీన్ మీద ఏ పాత్రైనా భయపడకుండా చేస్తానన్న ధైర్యం ఆమె ఎదుగుదలకు ప్లస్ పాయింట్‌గా మారుతోంది. సినిమా రిలీజ్ కాకముందే ఇంత హ buzz సృష్టించడం చాలా అరుదు. రామ్ గోపాల్ వర్మకు నచ్చి హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకున్న ఆరాధ్యదేవి ప్రస్తుతం. గ్లామర్ సోషల్ మీడియా హైప్ వర్మ బ్రాండ్ .యావత్తూ కలిసి భారీ క్రేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Virat Kohli Mania Visakhapatnam ODI :విశాఖపట్నంలో విరాట్ మేనియా – టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్, మ్యాచ్‌కు ముందు కోహ్లీ క్రేజ్ పీక్స్‌లో
    తర్వాత ఆర్టికల్
    Protein Balances Everything for Women : 30 ఏళ్లు దాటగానే మహిళల్లో మార్పులు.. ప్రోటీన్ కొరతే 90% సమస్యల కారణం!

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి