శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Virat Kohli Mania Visakhapatnam ODI :విశాఖపట్నంలో విరాట్ మేనియా – టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్, మ్యాచ్‌కు ముందు కోహ్లీ క్రేజ్ పీక్స్‌లో

    1 month ago

    విశాఖపట్నం ప్రస్తుతం ఒకే పేరుతో నిండిపోయింది – విరాట్ కోహ్లీ. భారత్–సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఫలితాన్ని నిర్ణయించే తుదిమ్యాచ్ వైజాగ్‌లో జరగనుండటంతో, నగరమంతా క్రికెట్ జోష్‌తో మార్మోగుతోంది. మ్యాచ్ దగ్గర పడుతున్న కొద్దీ కోహ్లీ క్రేజ్ మరింత పెరిగి రికార్డు స్థాయిలో టికెట్ డిమాండ్ నమోదైంది. 

    విరాట్ వరుస సెంచరీలే డిమాండ్‌ను మార్చేశాయి

    మొదట్లో ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు నెమ్మదిగానే సాగాయి. నవంబర్ 28న టికెట్లు విక్రికి పెట్టిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అభిమానుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో అధికారులు కౌంటర్లలో కూడా టికెట్లు అమ్మేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ రాంచీ, రాయ్‌పూర్ వన్డేలలో విరాట్ వరుసగా రెండు సెంచరీలు సాధించడంతో మొత్తం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  మూడో దశ ఆన్‌లైన్ టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా సోల్డ్ అవుట్ అయ్యాయి మొదట ఎవరూ పట్టించుకోని సీట్లకే ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది 

    ఎయిర్‌పోర్ట్‌ వద్ద అభిమానుల హడావిడి

    జట్టు నగరానికి చేరుకునే ముందునుంచే అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానం ఆలస్యమైనా గంటల తరబడి వేచి చూశారు. విరాట్, ఇతర ఆటగాళ్లు బయటకు రాగానే ఎయిర్‌పోర్ట్ మొత్తం కేకలు, చప్పట్లతో మార్మోగిపోయింది. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇదే దృశ్యం కనిపించింది . విమానం ఆలస్యంపై విమర్శలు చేసిన ప్రయాణీకులే, టీమిండియాను చూసిన వెంటనే ఉత్సాహంతో మొబైల్ కెమెరాలు ఆన్ చేసి మారిపోయారు. 

     

    డిసెంబర్ 6 వన్డే కోసం ఆసక్తి అతితీవ్రం

    సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌లో: విరాట్ ఇంకో సెంచరీ కొడతాడా? ఆయన ఫామ్ మళ్లీ పేలుతుందా? అనే ప్రశ్నలతో అభిమానుల ఉత్సాహం పీక్స్‌లో ఉంది. కోహ్లీ మరో శతకం బాదితే భారత్‌కు సిరీస్ అందించే అవకాశం ఉండటంతో మిలియన్ల మంది ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Sesame Seeds Every Day In Winter : శీతాకాలంలో నువ్వుల ప్రాధాన్యం – ఆరోగ్యానికి అపారమైన లాభాలు
    తర్వాత ఆర్టికల్
    Shaari movie actress Aaradhya Devi : సినిమా విడుదల కాకముందే సంచలనం – హాట్ టాపిక్‌గా ఆరాధ్యదేవి

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి