శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Chandeshwarudu: చిటికల చండీశ్వరుడు – భక్తి, శరణాగతి, శివానుగ్రహానికి ప్రతీక

    1 నెల క్రితం

    చిదంబరక్షేత్రంలో యచ్చదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కొడుకు *విచారశర్మ* చిన్న వయస్సులోనే వేదాలు నేర్చుకొని సుస్వరంతో పఠించేవాడు. గోవులను దేవతలుగా భావించిన అతడు ఒక రోజు గోవును కొడుతూ తీసుకువెళ్తున్నవారిని చూసి మనసు బాధపడి, అప్పటి నుండి ఆవులను తానే కాస్తానని ప్రతిజ్ఞ చేశాడు. గ్రామస్థులూ బ్రహ్మచారి అయిన అతడు ఆవులను కాపాడితే మంచిదని భావించి అతనికే ఆ బాధ్యత ఇచ్చారు. ఆవులు అతని భక్తి తెలుసుకొని ప్రతిరోజు అతడు తెచ్చిన కుండలో పాలు విడిచి అతడిని ఆశీర్వదించేవి.

     

    ఆవులు ఇచ్చిన పాలను శివాభిషేకం చేయాలని భావించిన బాలుడు ఇసుకతో సైకతలింగం నిర్మించి రుద్రాధ్యాయంతో శివారాధన చేసేవాడు. అతని ఈ నిష్కామభక్తిని అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి తండ్రికి సమాచారమిచ్చాడు. మరుసటి రోజు యచ్చదత్తుడు పొంచి చూశాడు. కొడుకు పాలను ఇసుకలో పోస్తున్నట్లు కనిపించడంతో, కోపంతో పరుగెత్తి వచ్చి బాలుడిని కొట్టాడు. శివారాధనలో లీనమైన విచారశర్మకు అప్పుడు బాహ్యస్మృతి లేకపోవడంతో ఎవరొచ్చారు అనేది గ్రహించలేకపోయాడు. తండ్రి సైకతలింగాన్ని తన్నినప్పుడు, “శివలింగాన్ని తన్నే పాదం ఉండకూడదు” అనే భావంతో గొడ్డలిని తీసి ఆ పాదాలను నరికేశాడు.

     

    తండ్రి మరణించగానే ఆశ్చర్యకరంగా ఛిన్నాభిన్నమైన సైకతలింగం మధ్య నుండి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించి, “నీ భక్తి అసాధారణం. ఇవాళ్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవ సభ్యుడు” అని వరం ఇచ్చారు. అలా చండీశ్వరుడిగా ఆ బాలుడికి అమరత్వం లభించింది.

     

    పరమేశ్వరుడు చండీశ్వరునికి ప్రత్యేక అధికారాన్ని ఇచ్చాడు. పార్వతీదేవి పెట్టే నైవేద్యంలో శివుడు తిని విడిచిన భాగం చండీశ్వరునికి దక్కుతుంది. అందుకే ఆయనను “పత్ని భాగం” మీద అధికారం కలవాడిగా భావిస్తారు. శివాలయాల్లో చండీశ్వరుని వ్రతం ప్రకారం, ఆయనను పిలిస్తే కోపం వస్తుందని చాలా స్వల్పంగా చిటిక వేయడం ఆనవాయం. ఆయన ధ్యానంలో ఉండే వాడు కనుక గట్టిగా శబ్దం చేయరాదు. ఈ కారణంగా చండీశ్వరుడిని “చిటికల చండీశ్వరుడు” అని పిలుస్తారు.

     

    శివాలయంలో ఇచ్చిన కొబ్బరికాయ, ప్రసాదం మొదలైనవి గుడిలో వదిలిపెట్టకూడదు; అవి ప్రసాదతిరస్కారంగా పరిగణిస్తారు. అవి చండీశ్వరునికి చూపించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. నందిపై ప్రసాదం పెట్టడం కూడా తప్పు. ద్రవిడదేశంలోని శైవ ఆలయాల్లో ఉత్సవమూర్తులలో నంది కాదు; చండీశ్వరుడు ప్రధానంగా ఊరేగింపులో ఉంటాడు. శివుడు ఇచ్చిన అయిదవ స్థానాన్ని చండీశ్వరుడు అధిష్టిస్తాడు.

     

    శివాలయంలోకి అడుగుపెడితే శివలింగం, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుని దర్శనం లభించడం గొప్ప భగ్యం. భక్తికి ప్రతిఫలం ఎలాంటిదో చండీశ్వరుని కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. శివభక్తుడైన చండీశ్వరుడు నిత్యమూ ధ్యానమగ్నుడై పరమ పావనస్థితిలో ఉంటూ, శైవ సాంప్రదాయం అంతర్భాగంగా నిలిచిపోయాడు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India Clinches ODI Series against South Africa : భారత్ సిరీస్ విజేత: యశస్వి సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీతో 9 వికెట్ల ఘన విజయం!
    తర్వాత ఆర్టికల్
    Mumbai Kotla devathalu : ముప్పై మూడు కోట్ల దేవతలు – నిజమైన అర్థం, తత్త్వం, వేదసారం

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి