శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    CHINA CINNAMON : చైనా దాల్చిన చెక్క హెచ్చరిక: రుచి కోసం రిస్క్ వద్దు – లివర్, కిడ్నీకి ముప్పు అంటున్న నిపుణులు

    1 నెల క్రితం

    ఇంటర్నెట్ డెస్క్ డిసెంబరు 2: ఆదివారం అంటే చాలా మందికి నాన్ వెజ్ తప్పనిసరి. చికెన్, మ‌ట‌న్ వంటకాలకు సువాసన, రుచి కోసం ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అందులో ప్రధానంగా ఉండేది దాల్చిన చెక్క. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండె ఆరోగ్యానికి సహాయపడడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.
    అయితే, మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువగా లభిస్తున్న చైనా దాల్చిన చెక్క (Cassia Cinnamon) గురించి ఆరోగ్య నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మన దేశం చైనాగా నుంచి పెద్ద మొత్తంలో ఈ రకం దాల్చిన చెక్కను దిగుమతి చేసుకుంటుండటంతో, వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
     
    చైనా దాల్చిన చెక్కలో ప్రమాదం – కౌమారిన్ ప్రభావం
    నిపుణుల ప్రకారం చైనా దాల్చిన చెక్కలో కౌమారిన్ అనే రసాయన పదార్థం సుమారు 1% వరకు ఉంటుంది. ఈ కౌమారిన్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే లివర్, కిడ్నీ అవయవాలను దెబ్బతీయగలదు. దీన్ని తరచూ వాడితే లివర్‌లో మంట, నొప్పి, ఫంక్షన్ మందగించడం వంటి సమస్యలు ఎదిరించే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
    కౌమారిన్ రక్తాన్ని పలుచగా చేసే గుణం కలిగి ఉండటంతో, ఇది శరీరంలో గాయాల నుంచి రక్తస్రావం ఎక్కువగా జరగడం, రక్తం త్వరగా గడ్డకట్టకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. దీర్ఘకాలంగా వాడితే ట్యూమర్ ఏర్పడే ప్రమాదం, కణాల వాపు వంటి సమస్యలు కూడా జంతువులపై చేసిన పరిశోధనల్లో గుర్తించబడ్డాయి. తక్కువ ధరలో లభిస్తోందని చైనా దాల్చిన చెక్కను వాడటం ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. రుచి కోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టొద్దని అంటున్నారు.
     
    ఎలా గుర్తించాలి – అసలు, నకిలీ దాల్చిన చెక్క తేడా
    చైనా దాల్చిన చెక్క (కాసియా) మరియు అసలు సిలోన్ దాల్చిన చెక్క మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి:
     

    చైనా (కాసియా) దాల్చిన చెక్క

     

     
    ఘాటైన, కారంగా ఉండే గాఢ వాసన
     
     
    గట్టిగా, మందపాటి బెరడు
     
     
    ముదురు గోధుమ రంగు
     
     
    తక్కువ ధర
     
     
    ఒక్క పొరలుగా కనిపించే కఠిన నిర్మాణం
     

     

     

    అసలు సిలోన్ దాల్చిన చెక్క (True Cinnamon)

     
     
    తీపి, సువాసన
     
     
    పలుచని, సన్నని పొరలు
     
     
    లేత గోధుమ రంగు
     
     
    చాలా మృదువుగా విరిగే లక్షణం
     
     
    తక్కువ ధర చూసి చైనా దాల్చిన చెక్కను కొనడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
     
    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Indian Stock Market : రూ. 89.76 వద్ద రికార్డు కనిష్టానికి రూపాయి – మదుపర్లలో ఆందోళన, సూచీలు నష్టాల్లో ముగింపు
    తర్వాత ఆర్టికల్
    vaibhav suryavanshi youngest t20 century record : క్రికెట్‌లో చిన్న వయసులో భారీ ఘనత: వైభవ్ సూర్యవంశీ టీ20లో శతకం

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి