శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Cracked Heels : చలికాలంలో పాదాల పగుళ్లు – కారణాలు, నివారణ మార్గాలు

    1 నెల క్రితం

    చలికాలంలో పాదాల మడమల పగుళ్ల సమస్య సాధారణంగా తీవ్రమవుతుంది. ఈ సమస్య గురించి బీబీసీ ఇంటర్వ్యూ లో డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ షాహినా షఫీక్ వివరించారు. ఆమె మాట్లాడుతూ, “పాదాల చర్మంలో సహజ నూనె గ్రంథులు తక్కువగా ఉంటాయి. శీతాకాలంలో ఈ నూనె ఉత్పత్తి మరింత తగ్గి, చర్మం పొడిగా మారుతుంది. దీని ఫలితంగా మడమల పగుళ్లు ఏర్పడతాయి” అన్నారు.

     

    వయసు, శరీర బరువు, జీవనశైలి ప్రభావం
    డాక్టర్ షాహినా చెప్పారు, వయసు పెరిగే కొద్దీ చర్మం స్థిరత్వాన్ని కోల్పోతుంది, సహజ నూనె ఉత్పత్తి తగ్గుతుంది. అంతే కాకుండా శరీరం బరువు ఎక్కువగా ఉండటం, పాదాల పై ఒత్తిడి పెరగడం వల్ల మడమల పగుళ్లు ఏర్పడే అవకాశం మరింత పెరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎక్కువ నడక చేసే, మట్టి, రాతి, కంక్రీటు ప్రాంతాల్లో ఎక్కువ ఉండే వ్యక్తులకు సమస్యగా ఉంటుంది.

     

    ఆరోగ్య పరిస్థితుల ప్రభావం
    డాక్టర్ అయనం సత్యనారాయణ వివరించారు, సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ రకాల సమస్యలు, డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధులు కూడా పాదాల మడమల్లో పగుళ్లకు కారణమవుతాయి. చలికాలంలో తక్కువ నీరు తాగడం, వేడినీటితో ఎక్కువ స్నానం చేయడం, స్నానం తర్వాత మడమలను సరిగ్గా తుడకకపోవడం వంటి కారణాలు కూడా చర్మం పొడిబారటానికి దారితీస్తాయి.

     

    చర్మ సమస్యల లక్షణాలు
    పాదాల మడమల పగుళ్లు మంట, నొప్పి, పొడిబారడం, చిట్లడం వంటి లక్షణాలను ఉత్పన్నం చేస్తాయి. రాత్రి పూట పడుకున్నప్పుడు బెడ్ షీట్ తో తాకడం కూడా మంటను పెంచుతుంది. చలి గాలి చర్మంలో తేమను తీసుకువెళ్తుంది, చర్మం బలహీనంగా మారి పగుళ్ల ఏర్పాటుకు దారి తీయగలదు. విటమిన్ A, C, D లోపం కూడా ఈ సమస్యను తీపి చేస్తుంది.

     

    నివారణ, సంరక్షణ మార్గాలు

    చల్లని నీటిలో ఎక్కువగా స్నానం చేయకుండా ఉండాలి. మడమలను స్నానం తర్వాత సులభంగా, జెంటిల్‌గా తుడకాలి. మాయిశ్చరైజర్లు, ఎమాలియంట్లు తరచుగా ఉపయోగించడం వల్ల చర్మం తేమను నిలుపుకోవచ్చు. విటమిన్లు, సరైన ఆహారం ద్వారా చర్మ ఆరోగ్యం పెంపొందించాలి. సొరియాసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలున్నట్లయితే, డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.  చలికాలంలో పాదాల మడమల పగుళ్లు చిన్న సమస్యగా కనిపించవచ్చా, అయితే నొప్పి, అసౌకర్యం, చర్మ గాయాలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి సకాలంలో చర్మ సంరక్షణ, తేమనిచ్చే సరైన చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    MEESHO IPO GMP : మీషో ఐపీఓ డిసెంబర్ 3న మొదలు – ₹5,421 కోట్ల భారీ పబ్లిక్ ఇష్యూ
    తర్వాత ఆర్టికల్
    SaiPallavi : టాలీవుడ్ క్రేజ్, బాలీవుడ్ బిగ్ బడ్జెట్: సాయి పల్లవి రెమ్యూనరేషన్ రివీల్

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి