శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Deputy Chief Minister Pawan Kalyan : గ్రామీణ సేవలపై వైద్యులకు పవన్ కళ్యాణ్ పిలుపు

    18 hours ago

    కాకినాడ: రంగరాయ మెడికల్ కళాశాల నూతన భవనాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వైద్యో నారాయణో హరి అంటారు… వైద్యులు దేవుళ్లతో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే, డాక్టర్లు పునర్జన్మనిస్తారు” అని అన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వైద్యులు కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు చికిత్స అందిస్తూ సమాజానికి అండగా నిలవాలని కోరారు.

    రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణమని పేర్కొన్న  పవన్ కళ్యాణ్ గారు, 1958లో ప్రారంభమైన ఈ కళాశాల ఎంతో మంది వైద్యులను రాష్ట్రానికి అందించిందన్నారు. వైద్య విద్యతోపాటు మానవత్వం, సేవాభావం నేర్పే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోందని ప్రశంసించారు. పూర్వ విద్యార్థుల సంఘం రామ్‌కోసా ఆర్థిక సహకారంతో రూ.10.11 కోట్ల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, నియో సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ స్క్రీనింగ్ వాహనాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ వాహనాలు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఉచిత దంత వైద్య సేవలు అందించనున్నాయి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, వైద్యులు, రామ్‌కోసా ప్రతినిధులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    The Indian states men are rushing to for jobs in 2026
    తర్వాత ఆర్టికల్
    Vidyut leaves the internet shocked as he goes nude to climb a tree

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి