శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Gold price rises : పసిడి పరుగు ఆగటం లేదు: 10 గ్రాముల ధర ₹1.30 లక్షలు దాటింది

    1 నెల క్రితం

    న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) పసిడి ధర ₹1.30 లక్షలు దాటిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధరలు 60 శాతం పెరగడం విశేషం. గత ఏడాది కాలంలో దేశంలో మరే ఇతర పెట్టుబడులు ఇంతటి లాభాలు ఇవ్వలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రికార్డు ధరలు

    ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) పసిడి $4,210 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, వచ్చే ఏడాది (2026) కూడా పసిడి పరుగెత్తుతూనే ఉంటుందని అంచనా. WGC ప్రకారం, వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరో 15–30% పెరిగే అవకాశం ఉంది. అంటే ఔన్స్ ధర $4,840 నుండి $5,470 మధ్య ఉండవచ్చని పేర్కొంది.  ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ కూడా ఇదే తరహా అంచనాలను వెల్లడించింది.

     

    భారత మార్కెట్లో ధరలు ఎక్కడికి చేరవచ్చు?

    దిగుమతి సుంకం 6% మరియు GST 3% కలుపుకుంటే 2026లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹1,49,500 నుండి ₹1,69,000 మధ్య ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పసిడి పెట్టుబడులు మరోసారి ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.

     

    అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి మారే పరిస్థితి

    అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల విధానం (Tariff policy) అమల్లోకి వచ్చి, దాని ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడితే—
    పసిడి ధరలో 5–20% వరకు దిద్దుబాటు (కరెక్షన్) వచ్చే ప్రమాదం కూడా ఉందని WGC హెచ్చరించింది. పసిడి ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు ఈ పరుగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ, పెట్టుబడిదారుల దృష్టిలో పసిడి ఇప్పటికీ అత్యంత సురక్షిత పెట్టుబడి సాధనంగానే ఉంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Pushpa 2 ready to release in japan ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జపాన్‌లో రిలీజ్
    తర్వాత ఆర్టికల్
    RBI Cuts Repo Rates by 25 Basis Points : ఆర్బీఐ మరోసారి గుడ్‌ న్యూస్: రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి