శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    YSRCP Protests in Eluru Over Mega DSC Irregularities : మెగా డీఎస్సీపై ఏలూరులో వైఎస్సార్‌సీపీ ఆందోళన.. విచారణకు డిమాండ్

    1 hour ago

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddy పిలుపు మేరకు మెగా డీఎస్సీ అవకతవకలు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ Karumuri Sunil Kumar పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

     

    ఈ సందర్భంగా మాట్లాడిన సునీల్ కుమార్, డీఎస్సీ నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, "మెగా దగా డీఎస్సీ" అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన Nara Lokesh, రెండేళ్లు గడిచినా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Modi Meets Myanmar President : మయన్మార్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు
    తర్వాత ఆర్టికల్
    R Madhavan's wife Sarita pens heartwaming birthday post for him

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి