శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    HIT MAN Rohit Sharmaఅరుదైన ప్రపంచ రికార్డుకు అత్యంత చేరువలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ

    1 month ago

    భారత క్రికెట్ జట్టు వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకునే అంచున నిలిచాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. నేటి నుంచి భారత్–సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా, ఈ సిరీస్ రోహిత్‌కు చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉంది.

     

    మరో మూడు సిక్సులు కొడితే ‘సిక్సుల కింగ్’!

    వన్డేల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 349 సిక్సులు బాదాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వన్డే సిక్సులు కొట్టిన ఆటగాడు పాకిస్తాన్ స్టార్ షాహిద్ అఫ్రిది, అతడి సిక్సుల సంఖ్య 351. అంటే రోహిత్ మరో మూడు సిక్సులు బాదితే అఫ్రిదిని అధిగమించి వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా చరిత్రలోకెక్కనున్నాడు.

    రోహిత్‌ పుల్ షాట్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. అతడి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం వలననే ఈ రికార్డు ఇప్పుడంత చేరువగా కనిపిస్తోంది. తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉండటంతో భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

     

    వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన  టాప్–5 ఆటగాళ్లు

    షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 351

    రోహిత్ శర్మ (భారత్) – 349

    క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 331

    సనత్ జయసూర్య (శ్రీలంక) – 270

    ఎంఎస్ ధోనీ (భారత్) – 229

    సౌతాఫ్రికాతో నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడా? అన్న ప్రశ్న ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    High blood pressure : అధిక రక్తపోటు: ‘సైలెంట్ కిల్లర్’ గుండెపోటు ప్రమాదానికి ప్రధాన కారణం
    తర్వాత ఆర్టికల్
    Healthy fruits for blood sugar control : డయాబెటిస్ ఉన్నవారికి ఈ 5 ఫలాలు శ్రేష్ఠం: షుగర్ కంట్రోల్‌కి సహాయపడతాయి

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి