kntv
kntv

చెన్నూరు: యల్లమ్మతల్లి ఆలయంలో భారీ చోరీ కలకలం!

2 weeks ago

చెన్నూరు మండలంలోని శ్రీ యల్లమ్మతల్లి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు అమ్మవారి కిరీటం, ముక్కుపుడక, చెవి పోగులతో పాటు సుమారు అర కిలో వెండి ఆభరణాలను అపహరించారు. తెల్లవారుజామున ఆలయం తెరిచిన అర్చకులు చోరీని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు