kntv
kntv

నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన అన్నమయ్య ఎస్పీ

15 hours ago

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించారు. ఆదివారం లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రామాపురం మండ లాల్లోని నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రక్రియ ప్రశాంతం గా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించామని తెలిపారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.