కోయంబత్తూర్, డిసెంబర్ 1 2025:
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వినిపించిన రూమర్స్ నిజమయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభూ రెండోసారి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ఈ వివాహం కొనసాగించారు.
వీరి పెళ్లి వేడుక కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. వివాహ సందర్భంలో సమంత ఎరుపు రంగు చీర ధరించి అందాలను చాటింది.
సోషల్ మీడియా రియాక్షన్
గత రెండు రోజులుగా సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరు మాజీ భార్య ష్యామలీ దే చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఆమె “తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని” అని పేర్కొన్నారు.