ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 25: అతి త్వరలో జరగనున్న ICC మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్ భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ సందర్భంలో క్రికెట్ అభిమానులకు తాజా అప్‌డేట్: టీ20 వరల్డ్ కప్-2026 షెడ్యూల్ మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. ఈసారి టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి.
పాల్గొనే జట్లు:
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్.
ముఖ్య వేదికలు:
ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారత్‌లోని 5 స్టేడియాల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి) మరియు శ్రీలంకలోని 3 వేదికల్లో జరగనున్నాయి. ముఖ్యంగా ప్రారంభ మ్యాచ్ మరియు ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించబడతాయి.
పాకిస్తాన్ మ్యాచ్‌లు:
BCCI మరియు PCB మధ్య ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ జట్టు అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్ కూడా కొలంబోలో జరుగుతుంది. అలాగే, సెమీఫైనల్‌లలో ఒక మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించబడుతుంది. భారత్ జట్టు ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. క్రికెట్ అభిమానులు ఈ షెడ్యూల్‌ను JioHotstar యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.