శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    The Raja Saab release rumours : ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వాయిదా? ఇండస్ట్రీలో హాట్ టాక్!

    1 month ago

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాల్లో నటిస్తూ తన రేంజ్‌ను భారీ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాన్స్, హారర్, కామెడీ మిళితమైన యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్‌ను పూర్తిగా భిన్నమైన లుక్‌లో చూపించబోతోందన్న కారణంతో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

     

    మొదట డిసెంబర్ 5 రిలీజ్‌గా అనుకున్న ఈ సినిమాను తర్వాత సంక్రాంతి సీజన్‌కు మార్చారు. జనవరి 9, 2026 కొత్త విడుదల తేదీగా ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా ఖరారు అయిందో లేదో అనే అనుమానాలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించాయి. అభిమానుల ఆందోళన పెరగడంతో, ఇటీవలే మేకర్స్ ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తూ — “సంక్రాంతికే వస్తున్నాం” అని మరోసారి స్పష్టత ఇచ్చారు.

     

    అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. ఇప్పటివరకు సినిమా బిజినెస్ పూర్తిగా ముగియలేదట. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, సాటిలైట్ మరియు ఓటీటీ డీల్స్ ఏవీ ఫైనల్ కాలేదన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బయ్యర్లు రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని, ప్రభాస్ సినిమానే అయినా ఈసారి బజ్ పెద్దగా లేకపోవడం డిస్ట్రిబ్యూటర్లను ఆగిపోమంటోందని తెలుస్తోంది.

     

    మరోవైపు ఈ సినిమాలో భారీగా ఉన్న VFX పనులు ఇంకా పూర్తి కాలేదన్నది మరో పెద్ద కారణంగా చెప్పబడుతోంది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ నెమ్మదిగా సాగుతుందని దగ్గరి వర్గాలు చెబుతున్నాయి. దీనితో రిలీజ్ డేట్‌పై మళ్లీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

     

    ఇక ఓటీటీ డీల్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. సాధారణంగా ప్రభాస్ సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు భారీ మొత్తాలు ఆఫర్ చేస్తుంటాయి. ఉదాహరణకు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాకే ఇప్పటికే సుమారు ₹160 కోట్ల ఓటీటీ డీల్ కుదిరిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ‘ది రాజా సాబ్’ విషయంలో మాత్రం రిలీజ్‌కు 40 రోజులు మాత్రమే ఉండగా కూడా ఓటీటీ ఒప్పందం కుదరలేదు. ఈ అంశం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

     

    ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఆశించినంత హైప్‌ను రాబట్టలేకపోవడంతో, సినిమా మళ్లీ వాయిదా పడుతుందా? అన్న ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్-కామెడీ థ్రిల్లర్‌కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహిస్తోంది. ప్రభాస్‌తో పాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ కాస్టింగ్, మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ ఎలిమెంట్స్ ಈ సినిమాకు మంచి బజ్ తెచ్చిపెట్టినప్పటికీ — బిజినెస్ పూర్తికాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, ఓటీటీ డీల్స్‌లో క్లారిటీ లేకపోవడం వంటి కారణాలతో రిలీజ్ డేట్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ రూమర్లతో ప్రభాస్ అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Rishab Shetty Warns Ranveer Singh : ‘కాంతార’ సన్నివేశాన్ని అనుకరించి వివాదంలో రణ్‌వీర్ సింగ్ – కన్నడిగుల ఆగ్రహం
    తర్వాత ఆర్టికల్
    Multibagger Stock Hazoor Multi Projects : హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దుమ్మురేపిన స్టాక్

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి