శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Yuvraj Singh, Harmanpreet Kaur : పీసీఏ నుంచి హర్మన్‌ప్రీత్, యువరాజ్ సింగ్‌లకు అరుదైన గౌరవం

    1 నెల క్రితం

    భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరియు భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) ప్రత్యేక గౌరవం ప్రకటించింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వీరిద్దరి పేర్లతో కొత్త స్టాండ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ రెండు స్టాండ్స్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు పీసీఏ తాత్కాలిక కార్యదర్శి సిద్ధాంత్ శర్మ తెలిపారు. ఇటీవల హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచకప్ గెలవడం ఈ గౌరవానికి ప్రధాన కారణమని ఆయన వివరించారు.

     

    సిద్ధాంత్ శర్మ మాట్లాడుతూ, “ప్రపంచకప్ విజయంతో భారత మహిళల క్రికెట్‌కు కొత్త అధ్యాయం రాసిన హర్మన్‌ప్రీత్‌ను సత్కరించడం మా గౌరవం. అదే రోజు భారత క్రికెట్‌కు సేవలందించిన రెండు ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ పేరుతో మరో స్టాండ్‌ను ప్రారంభిస్తాం” అని తెలిపారు. అదే కార్యక్రమంలో ప్రపంచకప్ గెలిచినందుకు హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌జోత్ కౌర్‌లకు గతంలో ప్రకటించిన నగదు బహుమతిని కూడా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. "దేశానికి గర్వకారణమైన ఈ విజయాల ముందు మా కానుక చాలా చిన్నది. అయినా యువతకు స్ఫూర్తినిచ్చేలా ఈ గౌరవాన్ని అందించడంలో మేము సంతోషిస్తున్నాం" అని శర్మ అన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    kapil dev : టెస్ట్ సిరీస్ ఓటమిపై కపిల్ దేవ్ వ్యాఖ్యలు: భారత్ బ్యాటింగ్‌లో కొత్త తరం ఓపిక తక్కువ
    తర్వాత ఆర్టికల్
    SSR and Mahesh మహేశ్–రాజమౌళి సినిమా టైటిల్‌పై ట్విస్ట్: ‘వారణాసి’కి కొత్త పేరు?

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి