శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    After 35 years actor Nandamuri Kalyan Chakravarthy makes a comeback : 35 సంవత్సరాల తర్వాత నందమూరి హీరో రీఎంట్రీ… ఎవరో తెలుసా?

    1 month ago

    తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ కి  చెందిన ఒక హీరో ఉన్నాడని చాలా మంది మర్చిపోయారు. ఆయన మరోకరే కాదు… నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఎంతో కొంత సినిమాలు చేసిన తరువాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమైన ఆయన, ఇప్పుడు దాదాపు 35 ఏళ్ల తర్వాత తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు.

     

    త్రివిక్రమరావు కుమారుడు – 1986లో హీరోగా ఎంట్రీ

    నందమూరి తారక రామారావు తమ్ముడు, నిర్మాత నందమూరి త్రివిక్రమరావు కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి 1986లో ‘అత్తగారు స్వాగతం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తరువాత వరుసగా తలంబ్రాలు, మాయా కోడలు సవాల్, ఇంటి దొంగ, దొంగ కాపురం, అక్షింతలు, మారణ హోమం, రుద్ర రూపం, అత్తగారు జిందాబాద్, రౌడీ బాబాయ్, జీవన గంగ, ప్రేమ కిరీటం, మేనమామ, అగ్ని నక్షత్రం, అంటూ అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

     

    చిరంజీవితో కలిసి చేసిన ‘లంకేశ్వరుడు’ – కీలక మలుపు

    1989లో చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన దాసరి నారాయణ రావు 100వ చిత్రం *‘లంకేశ్వరుడు’*లో కళ్యాణ్ చక్రవర్తి ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. కానీ ఆ మూవీ తరువాత అప్రత్యక్షంగా సినీ రంగానికి దూరమయ్యారు. కారణాలు ఎక్కడా వెల్లడికాకపోయినా, ఆయన గైర్హాజరు సినీ ప్రేక్షకులకు ఆశ్చర్యమే.

     

    మూడున్నర దశాబ్దాల తర్వాత రీఎంట్రీ – 'ఛాంపియన్'

    ఇప్పుడు దాదాపు 35 ఏళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. ‘ఛాంపియన్’ అనే సినిమాలో రాజీ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ పాత్ర కథలో చాలా ముఖ్యమైనదని యూనిట్ వెల్లడించింది. విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న ఆయన ఇంటెన్స్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  80ల్లో సన్నగా ఉండే హీరో కళ్యాణ్ చక్రవర్తి… ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంతో కనిపించడం సినీ వర్గాల్లో చర్చలకు తెరలేపింది.

     

    ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి 'ఛాంపియన్' వరకు

    స్వప్న సినిమాస్ నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కూడా ఒక కీలక పాత్ర కోసం ఆయనను సంప్రదించారని, కానీ ఆ సమయంలో ఆయన సున్నితంగా నిరాకరించారని సమాచారం. అయితే ‘ఛాంపియన్’ కథ నచ్చడంతో ఇన్నేళ్ల తర్వాత తిరిగి నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.   ఇంత పెద్ద విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నందమూరి కళ్యాణ్ చక్రవర్తికి ఈ చిత్రం కొత్త ఊపునిస్తుందా? మరోమారు ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేకస్థానం దక్కుతుందా? అనేది ఇప్పుడు పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    The best herbs to help lower cholesterol : చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సహజ ఆహారాలు
    తర్వాత ఆర్టికల్
    Facts to Know About Lord Hanuman : వివిధ సమస్యలకు హనుమత్ ఆరాధన – విధి, విధానాలు మరియు హనుమంతుని 9 అవతారాలు

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి