శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    The best herbs to help lower cholesterol : చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సహజ ఆహారాలు

    1 month ago

    చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్, ఫుల్-ఫ్యాట్ డెయిరీ పదార్థాలు, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, రోజువారీగా ఆల్కహాల్ లేదా పొగతాగే అలవాటు—ఇవన్నీ కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను పెంచే ప్రధాన కారణాలు. కొలెస్ట్రాల్ పెరుగుదలతో ఆర్టరీల్లో కొవ్వు పేరుకుపోయి, హార్ట్ అటాక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

    ఈ నేపథ్యంలో, కొలెస్ట్రాల్‌ని సహజంగా తగ్గించుకునేందుకు మన ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ మరియు మసాలాలను చేర్చాలని న్యూట్రిషనిస్ట్  సూచిస్తున్నారు. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు సిరల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడంలో సహాయపడతాయి.

     

    దాల్చిన చెక్క— హృదయానికి సహజ రక్షణ

     

    శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుంది

    మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరగడానికి తోడ్పడుతుంది

    బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది

    ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది

    లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది

    దాల్చిన చెక్కపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, చాలా అధ్యయనాలు దీనికి అనుకూల ఫలితాలు చూపుతున్నాయని తెలిపారు.

    దాల్చిన చెక్కను ఇలా తీసుకోవచ్చు:

    దాల్చిన చెక్క టీ (5–10 నిమిషాలు మరిగించి తాగడం)

    ఓట్స్‌పై పొడి చల్లి

    పెరుగులో కలిపి

    బేకింగ్‌లో ఉపయోగించి

     

    మెంతులు — చెడు కొలెస్ట్రాల్‌కు సహజ శత్రువు

    మెంతుల్లో ఉండే సోల్యూబుల్ ఫైబర్, సపోనిన్స్ వంటి పదార్థాలు:

    శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ‌పెరగకుండా కాపాడుతాయి

    లివర్‌లో కొవ్వు చేరడాన్ని తగ్గిస్తాయి

    మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

    మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి

    శరీరంలోని టాక్సిన్‌లను బయటికి పంపుతాయి

    మెంతులను ఇలా తీసుకోవచ్చు:

    రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడపునే తీసుకోవడం

    ఆ నీటిని మరిగించి తాగడం

    మెంతుల పొడి‌ను వంటల్లో ఉపయోగించడం

    మెంతు నీటిని మరిగించి తాగితే అది త్వరగా జీర్ణమై మంచి ఫలితాలు ఇస్తుందని న్యూట్రిషనిస్ట్ సూచిస్తున్నారు.  సరైన ఆహారం, సాధారణ వ్యాయామం, హానికర అలవాట్ల నుంచి దూరంగా ఉండటం—ఇవన్నీ కలిపి పాటిస్తే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం సులభమవుతుంది. దాల్చిన చెక్క, మెంతులు వంటి సహజ పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చడం ద్వారా హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    What are the disadvantages of eating dry coconuts? ఎండు కొబ్బరి తినడం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, మరియు జాగ్రత్తలు
    తర్వాత ఆర్టికల్
    After 35 years actor Nandamuri Kalyan Chakravarthy makes a comeback : 35 సంవత్సరాల తర్వాత నందమూరి హీరో రీఎంట్రీ… ఎవరో తెలుసా?

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి