శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Against South Africa In Ind Vs Sa 3rd Odi At Vizag : భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డే: వైజాగ్‌లో డిసైడర్ మ్యాచ్

    1 month ago

    భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో మూడో వన్డే విశాఖపట్నం వేదికగా డిసైడర్‌గా మారింది. ఈ కీలక మ్యాచ్‌లో ఎట్టకేలకు టీమిండియా టాస్ గెలిచింది. తేమ ఎక్కువగా ఉండటంతో భారత ఫీల్డింగ్ ఎంచుకొని సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయాన్ని సాధించింది. కాబట్టి మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ టైటిల్ సొంతం చేసుకోవనుంది.

     

    గత 20 మ్యాచ్‌లుగా టాస్ ఓడుతూ వస్తున్న టీమిండియా, ఈసారి వైజాగ్ వన్డేలో ఎట్టకేలకు టాస్ నెగ్గింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ నాయకత్వంలో దొరకని బ్రేక్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ మూడో మ్యాచ్‌లో సరిగ్గా దొరికింది. టీమిండియా ఒక మార్పు చేసి, మొదటి రెండు వన్డేల్లో రాణించలేకపోయిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మను ఆటలోకి తీసుకొచ్చింది. తిలక్ రాకతో టీమిండియా బ్యాటింగ్ బలపడుతుందని కోచ్, అభిమానులు ఆశిస్తున్నారు.  సౌతాఫ్రికా కూడా రెండు మార్పులతో బరిలోకి వచ్చింది. బర్గర్, టోనీ డీ జోర్జ్‌ను పక్కన పెట్టి ర్యాన్ రికెల్టన్, బార్ట్‌మన్‌ను ప్లేయింగ్ 11లో చేర్చింది.

     

    తొలి వన్డేలో 135 పరుగులు చేసిన విరాట్ కోహ్లి, రెండో వన్డేలో 102 పరుగులు చేసి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీ సాధించాడు. అభిమానులు మూడో వన్డేలో కూడా కోహ్లి సెంచరీ చేయాలని కోరుకుంటున్నారు. అలాగే రోహిత్ శర్మ మదర్‌ల్యాండ్ అయిన విశాఖలో హిట్ మ్యాన్‌గా రాణించాలని టీమిండియా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Meenakshi Chaudharys Team Denies Marriage Rumours : టాలీవుడ్‌లో మీనాక్షి–సుశాంత్ పెళ్లి రూమర్స్‌పై క్లారిటీ
    తర్వాత ఆర్టికల్
    Rbi New Rules For Bsbd Basic Savings : RBI బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్‌కు కొత్త నిబంధనలు: 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి