శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Meenakshi Chaudharys Team Denies Marriage Rumours : టాలీవుడ్‌లో మీనాక్షి–సుశాంత్ పెళ్లి రూమర్స్‌పై క్లారిటీ

    1 నెల క్రితం

    టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి మరియు హీరో సుశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని మీమ్ పేజీలు, సోషల్ మీడియా అకౌంట్లు వచ్చే ఏడాదిలో వారిద్దరి వివాహం జరుగుతుందని పోస్టులు పెడుతుండటంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.

    ఇటీవల ఓ ఎయిర్‌పోర్టులో మీనాక్షి, సుశాంత్ కలిసి కనిపించడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. దీంతో స్పందించిన మీనాక్షి టీమ్, అధికారిక ప్రకటన విడుదల చేసింది. “సుశాంత్ మరియు మీనాక్షి కేవలం మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరి మధ్య స్నేహం తప్ప మరే బంధం లేదు” అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, మీనాక్షికి సంబంధించిన ఏ అధికారిక సమాచారం కావాల్సినప్పటికీ తమ నుంచే వస్తుందని పేర్కొంది. ఈ రూమర్స్‌ను ఇకపైనా వ్యాప్తి చేయరాదని కోరింది.

    ఇది మొదటి సారి కాదు. ఇంతకుముందూ ఇలాంటి ప్రచారాలు వచ్చినప్పుడు స్వయంగా మీనాక్షి చౌదరి స్పందించి, ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని ఖండించారు. అయినప్పటికీ వదంతులు ఆగకపోవడంతో ఆమె టీమ్ మరోసారి క్లీన్ క్లారిటీ ఇచ్చింది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలో కలిసి నటించిన మీనాక్షి, సుశాంత్ అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇదే స్నేహాన్ని పెళ్లి వార్తలుగా మార్చి ప్రచారం చేస్తున్నారని వారి టీమ్ భావిస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Mana ShankaraVaraprasad Garu Title Glimpse : చిరంజీవి–నయనతార జంట కొత్త సాంగ్ ప్రోమో అదిరింది — ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందం సర్‌ప్రైజ్
    తర్వాత ఆర్టికల్
    Against South Africa In Ind Vs Sa 3rd Odi At Vizag : భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డే: వైజాగ్‌లో డిసైడర్ మ్యాచ్

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి