శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Air India Is Our Responsibility : ఎయిరిండియా మా కోసం కేవలం వ్యాపారం కాదు… బాధ్యత కూడా: టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌

    1 month ago

    టాటా గ్రూప్‌కు ఎయిరిండియా కేవలం వ్యాపార అవకాశం మాత్రమే కాదు, దేశం పట్ల ఒక గొప్ప బాధ్యత అని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ స్పష్టం చేశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జేఆర్‌.డి. టాటా 121వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమానయాన రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందనీ, వాటిని అధిగమించి ఎయిరిండియాను ప్రపంచ శ్రేణి ఎయిర్‌లైన్‌గా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

     

    చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. విమానాల విడిభాగాల లభ్యత, నిర్వహణాపరమైన పరికరాలు, కొత్త విమానాల సరఫరా వంటి కీలక అంశాలు ఇప్పటికీ సవాళ్ల మధ్యలోనే ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎయిరిండియాను ఆధునికీకరించడం పెద్ద కర్తవ్యం అయినప్పటికీ, టాటా గ్రూప్‌ దీనిని ఒక అవకాశంగా, ఒక ధర్మబాధ్యతగా స్వీకరించిందని తెలిపారు.

     

    దాదాపు ఏడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన ఎయిరిండియాను 2022 జనవరిలో రూ. 18,000 కోట్లకు టాటా సన్స్‌ కొనుగోలు చేసింది. ఈ స్వాధీనాన్ని భారత విమానయాన చరిత్రలో ఒక కీలక మలుపుగా విశ్లేషకులు అభివర్ణిస్తారు. కొనుగోలు అనంతరం ఎయిరిండియాను తిరిగి మెరుగుపరచడం, ఆధునికీకరించడం, గలోబల్‌ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్లడం కోసం టాటా గ్రూప్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. విమానాల అప్‌గ్రేడేషన్‌, సేవా ప్రమాణాల పెంపు, కస్టమర్‌ అనుభవం మెరుగుదల వంటి అంశాలలో వేగంగా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. చంద్రశేఖరన్‌ వ్యాఖ్యలతో ఎయిరిండియా పునరుద్ధరణపై టాటా గ్రూప్‌ సీరియస్‌గా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. ఆయన మాటల ప్రకారం జేఆర్‌.డి. టాటా కలలు కన్న స్థాయికి ఎయిరిండియాను మరలా తీసుకెళ్లేందుకు గ్రూప్‌ కట్టుబడి ఉంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    The Kanipakam Vinayaka Temple :కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి మహిమాన్విత క్షేత్రం
    తర్వాత ఆర్టికల్
    Rishab Shetty Warns Ranveer Singh : ‘కాంతార’ సన్నివేశాన్ని అనుకరించి వివాదంలో రణ్‌వీర్ సింగ్ – కన్నడిగుల ఆగ్రహం

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి