హైదరాబాద్, నవంబర్ 24, 2025:
చలికాలం మొదలైన వెంటనే ప్రజలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య — గొంతులో, ఛాతీలో కఫం పేరుకుపోవడం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు పెరగడంతో, జలుబు, దగ్గు, కఫం సమస్యలు ఎక్కువరికీ ఇబ్బంది పెడుతున్నాయి. శ్వాసలో ఇబ్బంది, ఛాతీ బిగుతు, నిరంతర దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఒక సులభమైన పరిష్కారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెల్లం కఫం పెంచదు… తగ్గిస్తుంది!
బహుశా చాలామంది బెల్లం తింటే కఫం పెరుగుతుందని నమ్ముతారు. అయితే, ఇది సగం నిజం—సగం అపోహే అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద డాక్టర్ రాబిన్ శర్మ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్న వివరాల ప్రకారం, బెల్లంతో తయారు చేసిన ప్రత్యేక కషాయం:
ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం (కఫం)ను కరుగ చేస్తుంది. గొంతులోని బిగుతును తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తుంది. చల్లని వాతావరణం, దుమ్ము, కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్లు కఫం పేరుకుపోయే ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో బెల్లం కషాయం శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచి కఫం తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
బెల్లం కషాయం ప్రయోజనాలు
శ్వాస మార్గాలను శుభ్రం చేస్తుంది. తక్షణ ఉపశమనం ఇస్తుంది. గొంతు ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. కఫం, జలుబు, దగ్గు నుంచి నేచర్‌గా రక్షిస్తుంది
ఈ బెల్లం కషాయం ఎలా తయారు చేయాలి?
పదార్థాలు:
బెల్లం – 1 టేబుల్ స్పూన్
నీరు – 1 గ్లాస్
అల్లం ముక్క – చిన్నదైనది
మిరియాల పొడి – అరకొంచెం
తులసి ఆకులు – 4 నుండి 5
నిండు నిమ్మరసం – కొద్దిగా (ఐచ్చికం)
తయారీ విధానం:
ఒక గిన్నెలో నీరు పోసి మరిగించాలి. అందులో అల్లం, తులసి ఆకులు వేసి 3–4 నిమిషాలు మరిగించాలి. తర్వాత బెల్లం వేసి పూర్తిగా కరుగే వరకు కలపాలి. చివరగా మిరియాల పొడి వేసి మరో నిమిషం మరిగించాలి. దింపి వడకట్టి గోరువెచ్చగా తాగాలి. కావాలనుకుంటే నిమ్మరసం కలుపుకుంటే మరింత మంచిది.
ఎప్పుడు తాగాలి?
ఉదయం ఖాళీ కడుపుతో రాత్రి పడుకునే ముందు ఈ సమయంలో తాగితే కఫం, గొంతు బిగుతు, దగ్గు వంటి సమస్యలు మరింత వేగంగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.