శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Health Benefits Of Horse Gram : శీతాకాలంలో ఉలవలు ఆరోగ్యానికి దోహదం: పోషకాహారం, ఇమ్యూనిటీ, గుండెకు మేలు

    1 month ago

    ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 30 :   ఈ రోజుల్లో చలి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శరీర ఉష్ణోగ్రతలలో మార్పులు వస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి, వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా శరీరంలో ప్రవేశిస్తాయి. శాస్వనాళాలు బలహీనపడి అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ సమస్యల నుంచి రక్షణ పొందడానికి పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

     

    ఉలవలు: చలికాలం ఆహారంలో కీలకం

    చిరు ధాన్యాల్లో ఒకటి అయిన ఉలవలు, శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్స్ (B1, B2, B6, C), కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఉలవలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, శక్తి సరిపోతుంది మరియు అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి.

     

    లాభాలు

    జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: ఉలవల్లో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురుకావు. శ్వాస సంబంధిత రక్షణ: జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె, రక్తపోటు, చక్కెర నియంత్రణ: ఫెనోలిక్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు, చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఎముక, రక్తహీనత, కీళ్ల నొప్పులకు మేలు: రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు, చర్మం మరియు జుట్టుకు పోషణ.

     

    ఎలా తినాలి?

    ఉడికించిన ఉలవలను రసం, సాంబార్, కూరలుగా తినవచ్చు. గుగ్గిళ్లు లేదా నానబెట్టి మొలకలొచ్చాక తినడం రుచికరంగా ఉంటుంది. కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలాతో తింటే రుచి మరింత పెరుగుతుంది.  ఉలవలు చలికాలంలో తింటే ఆరోగ్యానికి మాత్రమే కాక, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, శక్తిని నిలుపుకోవడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Healthy fruits for blood sugar control : డయాబెటిస్ ఉన్నవారికి ఈ 5 ఫలాలు శ్రేష్ఠం: షుగర్ కంట్రోల్‌కి సహాయపడతాయి
    తర్వాత ఆర్టికల్
    andre russell announces retirement : KKR అభిమానులకు షాక్: రస్సెల్ రిటైర్మెంట్, కొత్త బాధ్యతలలోకి అడుగు

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి