ఇంటర్నెట్ డెస్క్ : హార్మోన్లు అనేవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయన దూతలు. ఇవి రక్తప్రవాహం ద్వారా శరీరమంతా సందేశాలను ప్రసారం చేస్తూ, మన మానసిక స్థితి, శక్తి, జీవక్రియ, నిద్ర, ఆకలి, రుతుచక్రం, పునరుత్పత్తి ఆరోగ్యం, పెరుగుదలను నియంత్రిస్తాయి.
హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి?
ఏదైనా కారణం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలు అధికంగా లేదా తగినంతగా లేని పరిస్థితిను హార్మోన్ల అసమతుల్యత అంటారు. దీని ప్రభావాలు క్రమంగా కనిపిస్తాయి, కానీ విస్మరించటం ప్రమాదకరం. పరిష్కారం లేకపోతే , బరువు పెరగడం, రుతుక్రమం సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం, మానసిక స్థితిలో మార్పులు
హార్మోన్ల అసమతుల్యతకు సాధారణ కారణాలు
జీవనశైలి లోపాలు: అసమతుల్య ఆహారం, తగిన నిద్ర లేకపోవడం, నిరంతర ఒత్తిడి
మహిళల ప్రత్యేక కారణాలు: గర్భం, PCOS, థైరాయిడ్ సమస్యలు
హార్మోన్లపై ప్రభావం చూపే ఇతర అంశాలు: జంక్ ఫుడ్, తక్కువ శారీరక శ్రమ, ఊబకాయం, వాపు, అధిక మందులు, ఎక్కువ కెఫిన్ లేదా ఆల్కహాల్, పర్యావరణ రసాయనాలు (BPA)
సాధారణ లక్షణాలు
నిరంతర అలసట, ఆకస్మిక బరువు మార్పులు, మహిళల్లో మొటిమలు, జుట్టు రాలడం, మానసిక స్థితి మార్పులు: ఆందోళన, నిరాశ, చిరాకు, నిద్రలేమి లేదా అధిక నిద్ర, జీర్ణ సమస్యలు, ముఖం వాపు, తరచుగా తలనొప్పి . ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
హార్మోన్ల సమతుల్యత కోసం జాగ్రత్తలు
సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర పొందడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు పాటించడం, చక్కెర తగ్గించడం, నీరు పుష్కలంగా తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం