శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    malayalam horror thriller movie dies irae to stream : హారర్ థ్రిల్లర్ ‘డైస్ ఇరే’ డిసెంబర్ 5 నుండి జియోహాట్‌స్టార్ లో ఓటీటీ రిలీజ్

    1 month ago

    ఈ ఏడాది మలయాళంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే (Dies Irae). అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఇప్పుడు డిజిటల్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.  డైస్ ఇరే ఈ శుక్రవారం, అంటే డిసెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో లభిస్తుంది. IMDbలో 7.3 రేటింగ్‌ సాధించిన ఈ మూవీ, ఐదు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కావడంతో మరింత ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి.

    సినిమా కథనమా?

    ‘డైస్ ఇరే’ కథ ఆత్మ, ప్రతీకారం అంశాల చుట్టూ తిరుగుతుంది. ప్రధాన పాత్రధారి రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఒక ఆర్కిటెక్ట్. అతని ఫ్యామిలీ అమెరికాలో ఉంటారు, కానీ రోహన్ ఇండియాలో పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటాడు.

    ఒక రోజు అతని క్లాస్‌మెట్ కని (నర్తకి) ఆత్మహత్య చేసుకుంటుంది. కని ఫ్యామిలీని పరామర్శించడానికి రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ కని గది లోని రెడ్ కలర్ హెయిర్ క్లిప్ ను రోహన్ తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటినుండి ఇంట్లో వింత ఘటనలు చోటుచేసుకుంటాయి. రోహన్ అనుకుంటాడు, ఆత్మ కని యొక్క ఆత్మనే అతన్ని వెంటాడుతోంది.

    కని భ్రమలో కనిపించే రహస్య శక్తి, కిరణ్ (కని సోదరుడు) రోహన్ పై ప్రవర్తన, ఫిలిప్ ప్రేమకథతో కలిసే ట్విస్ట్ చివరగా క్లైమాక్స్ లో హారర్ ఎఫెక్ట్‌ సృష్టిస్తుంది. ఈ సినిమాను భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేసారు. ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించి, ప్రేక్షకులను భయభ్రాంతిలో ఉంచే విధంగా కధనాన్ని రూపొందించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Mrunal Condemns The Rumors : శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ! “ఇవి ఫ్రీ పీఆర్ స్టంట్స్"
    తర్వాత ఆర్టికల్
    Chaturdasha Bhuvanalu : చతుర్దశ భువనాలు – పురాణాలలో విశ్వ విన్యాస రహస్యం

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి