శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mamata Banerjee : మమత ధర్నాకు నేతల డుమ్మా.. టీఎంసీలో సంక్షోభ సంకేతాలా?

    2 hours ago

    టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడులకు నిరసనగా మమతా ఈ ధర్నాకు దిగినా, 78 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. అలాగే 41 మంది ఎంపీలలో ఐదుగురు మాత్రమే నిరసన వేదిక వద్ద కనిపించడం గమనార్హం. ఎన్నికల్లో ఓటమి చెందిన కొందరు మాజీ మంత్రులు, నేతలు మాత్రం మమతకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఇటీవల మమత నివాసంలో నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి కూడా 80 మందిలో కేవలం 20 మంది మాత్రమే హాజరుకావడంతో సమావేశం రద్దైన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అధికారికంగా వివరణ ఇచ్చినా, అంతర్గత విభేదాలు, అసంతృప్తులే గైర్హాజరుకు కారణమన్న ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో కొందరు రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ‘అస్లీ తృణమూల్’ పేరుతో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుపై చర్చించినట్లు వార్తలు రావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజా పరిణామాలు టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోందనే సంకేతాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Not Harrison Ford but Tom Selleck was first choice for Indiana Jones
    తర్వాత ఆర్టికల్
    Optical illusion personality test: Birds or man? What you see first reveals if your mind is restless or composed

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి