శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    megastar : చిరంజీవి చేతుల మీదుగా ‘స్పిరిట్’ ముహూర్తం షాట్

    1 నెల క్రితం

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై, ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాతలు భూషణ్ కుమార్, వంగా ప్రణయ్, శివ తదితరులు పాల్గొన్నారు.

    చిత్ర బృందం ప్రకారం, ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సంచలన సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీ-సిరీస్ మరియు వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని బృందం తెలిపింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Andhra king thaluka avm : రామ్‌ హీరోగా ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్ 27న విడుదల
    తర్వాత ఆర్టికల్
    India Women's Blind Cricket team : భారత్ అంధుల మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి