kntv
kntv

మహలనోబిస్ సేవలు చిరస్మరణీయం: పవన్ కళ్యాణ్

1 month ago

జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్ ప్రొఫెసర్ ప్రసాంత చంద్ర మహలనోబిస్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. భారత గణాంక వ్యవస్థకు ఆయన చేసిన సేవలు దేశాభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు. ఆధారపూర్వక పాలన, శాస్త్రీయ దృక్పథం, విశ్వసనీయ గణాంకాలతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.