శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Stock Split: మినీ డైమండ్స్ ఇండియా షేర్‌హోల్డర్లకు శుభవార్త

    1 నెల క్రితం

    స్మాల్‌క్యాప్ జెమ్స్ & జ్యూవెలరీ సర్వీసెస్ రంగానికి చెందిన మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ తన వాటాదారులకు భారీ అప్‌డేట్ ఇచ్చింది. ఇటీవల బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీ స్టాక్ స్ప్లిట్ చేయాలని ఆమోదించగా, తాజాగా ఈ స్ప్లిట్‌కు సంబంధించిన రికార్డు డేట్‌ను డిసెంబర్ 2, 2025గా ప్రకటించింది.

    1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్

    కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం— నవంబర్ 13, 2025న జరిగిన బోర్డు సమావేశంలో 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్‌కి గ్రీన్ సిగ్నల్ లభించింది. అంటే రూ. 10 ఫేస్ విలువ ఉన్న 1 ఈక్విటీ షేరును, రూ. 2 ఫేస్ విలువ కలిగిన 5 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం సుమారు రూ. 140 వద్ద ఉన్న షేర్ ధర సుమారు రూ. 28 స్థాయికి చేరే అవకాశం ఉంది.

     

    మినీ డైమండ్స్ షేర్ పనితీరు – మల్టీబ్యాగర్ హిస్టరీ

    గత ఐదేళ్లలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు అద్భుత రాబడులు అందించింది.

    5 సంవత్సరాల్లో లాభం: 5187% రూ. 1 లక్ష పెట్టుబడి విలువ: రూ. 51.87 లక్షలు ,ప్రస్తుతం మార్కెట్ క్యాప్: రూ. 330 కోట్లు

    అయితే ఇటీవల ఈ స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది—

    వారం రోజుల్లో: 3% నష్టం. నెలలో: 3% తగ్గుదల, ఆరు నెలల్లో: 27% పడిపోయింది ఏడాదిలో: 30% నష్టం

    శుక్రవారం ముగిసిన మార్కెట్ సెషన్‌లో షేరు 1.30% క్షీణించి రూ. 140.10 వద్ద ముగిసింది.

    52 వారాల గరిష్ఠం: రూ. 233

    కనిష్ఠం: రూ. 97.50

     

    ఎందుకు స్టాక్ స్ప్లిట్?

    కంపెనీ ప్రకటన ప్రకారం—

    • షేర్ ధరను రీటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చడం,

    • లిక్విడిటీ పెంచడం ప్రధాన లక్ష్యాలు. 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Amarnath Yatra : “మోక్షానికి దారి చూపే అమరనాథ్ యాత్ర – మంచుతో ఏర్పడే శివలింగ రహస్యాలు”
    తర్వాత ఆర్టికల్
    Cricketer Smriti Mandhana : స్మృతి మంధాన వివాహం వాయిదా: ముహూర్తానికి గంటల ముందు తండ్రికి హార్ట్ అటాక్

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి