- సీఎంఆర్ఎఫ్ ద్వారా 32 మందికి ₹18.69 లక్షల ఆర్థిక సహాయం – ఇప్పటివరకు అవనిగడ్డ నియోజకవర్గంలో 811 మందికి ₹6.42 కోట్లకు పైగా సాయం
అవనిగడ్డ: పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు తెలిపారు. ఆదివారం అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి (C.M.R.F) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మందికి మొత్తం ₹18,69,564 విలువైన ఆర్థిక సహాయం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు.
కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సహాయం
ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజకీయపరమైన తేడాలను పక్కన పెట్టి, అత్యవసర వైద్య అవసరాల కోసం పేదలకు వెంటనే సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పేదలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
అవనిగడ్డలో ఇప్పటివరకు 811 మంది లబ్ధిదారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నేటి వరకు అవనిగడ్డ నియోజకవర్గంలోనే 811 మందికి మొత్తం ₹6,42,23,757 విలువైన ఆర్థిక సహాయం అందించటం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్ గారు పాల్గొన్నారు.