హైదరాబాద్, నవంబరు24 : హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఐబొమ్మ రవి (Ibomma Ravi)ను గత నాలుగు రోజులుగా విచారిస్తున్నప్పటికీ, ఆయన విచారణకు సరైన సహకారం అందించడం లేదని సమాచారం. ఈరోజుతో ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, మరోసారి కస్టడీ పొడిగించాలా అనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు తప్పా పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏదీ రవి వెల్లడించకపోవడంతో దర్యాప్తు కఠినతరమైంది. సినిమాలపై ఇష్టంతోనే ఈ పని చేసినట్టు రవి చెబుతున్నప్పటికీ, లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడటం, అనేక దేశాలకు ప్రయాణాలు చేయడం, భారీ ఆస్తులు కూడబెట్టడం వంటి అంశాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలను ఖచ్చితంగా పరిశీలించేందుకు బ్యాంకులకు అధికారులు లేఖలు పంపారు. ఇదే కేసులో సీఐడీ కూడా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Click here to
Read More