బెంగళూరు , నవంబరు 25: కెనరా బ్యాంక్‌లో కీలక పదోన్నతి చోటుచేసుకుంది. సునీల్ కుమార్ చగ్‌ను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చింది. సునీల్ కుమార్ చగ్ పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉండనుంది. ఈ పదవిని స్వీకరించే ముందు ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సేవలందించారు.
బ్యాంకింగ్ రంగంలో చగ్‌కు మూడు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉండటం విశేషం. రుణాలు, రిస్క్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్, స్ట్రాటజీ వంటి కీలక విభాగాల్లో ఆయన విశిష్ట సేవలు అందించినట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంక్ అధినేతలు చగ్ నియామకంతో బ్యాంక్ కార్యకలాపాలకు మరింత బలం చేకూరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.