శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Heroine Meenakshi Chaudhary : ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిన మీనాక్షి చౌదరి – వరుస హిట్స్‌తో క్రేజీ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న స్టార్ బ్యూటీ

    1 month ago

    టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఒకటే—మీనాక్షి చౌదరి. సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటి వరకు పెద్దగా ఆఫర్లు దక్కని ఈ భామ, ఇప్పుడు మాత్రం వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆఫర్లు క్యూ కడుతుండటంతో యమా బిజీగా మారిన మీనాక్షి, గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

     

    మీనాక్షి కెరీర్ ఒక్కసారిగా గేర్ మార్చేసింది. యంగ్ హీరోల సినిమాల నుంచీ స్టార్ హీరోల ప్రాజెక్టుల వరకూ అన్ని ఆఫర్లు వరుసపెట్టి వస్తున్నాయి. మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత దళపతి విజయ్ చిత్రమైన గోట్ లో కూడా మెరిసింది. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నాం. రెండు చిత్రాలు వరుస హిట్స్ కావడంతో మీనాక్షి ఫుల్ జోష్‌లో ఉంది.

     

    తాజాగా మీనాక్షి చౌదరి వ్యక్తిగతంగా కూడా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అతనే నా ఫస్ట్ క్రష్… ఆ తర్వాత ఎవరి మీదా అలా ఫీలింగ్ రాలేదు అని ఆమె చెప్పుకొచ్చింది. ఎవరో చెప్పకపోయినా, ఆమె వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపాయి.

    అలాగే,  ప్రతీ ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరి మీద క్రష్ ఉంటుంది. మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఇలాంటి ఫీలింగ్‌తోనే తెరకెక్కింది. సినిమా మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది  అని మీనాక్షి వెల్లడించింది. మొన్నటి వరకు పెద్ద అవకాశాల కోసం ఎదురుచూసిన మీనాక్షి చౌదరి, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు
     వరుస హిట్స్  స్టార్ రేంజ్ ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతున్న నెక్స్ట్ బిగ్ స్టార్‌గా మారింది. ఆమె జోరు ఇదేలా కొనసాగితే, మీనాక్షి త్వరలోనే టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చోటు సంపాదించడం ఖాయం! 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Protein Balances Everything for Women : 30 ఏళ్లు దాటగానే మహిళల్లో మార్పులు.. ప్రోటీన్ కొరతే 90% సమస్యల కారణం!
    తర్వాత ఆర్టికల్
    mriti mandhana first post after wedding : స్మృతి మంధాన–పలాశ్ ముచ్చల్‌ పెళ్లి వాయిదా… రింగ్‌ లేకుండా కనిపించిన వీడియోపై కొత్త చర్చ

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి