kntv
kntv

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సీఎం ప్రత్యేక సందేశం

2 months ago

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వైద్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్యం కోసం వైద్యులు చేస్తున్న నిస్వార్థ సేవలు, త్యాగాలు, అంకితభావాన్ని ఆయన కొనియాడారు. ఎన్నో సవాళ్ల మధ్య ప్రజలకు ఆశ, ఆరోగ్యాన్ని అందిస్తున్న వైద్యుల సేవాస్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.