శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    whatsapp telegram new rules : వాట్సాప్‌–టెలిగ్రామ్‌–సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లపై కేంద్రం నూతన కఠిన నియమాలు; ఫోన్‌లో సిమ్ లేకపోతే యాప్‌లు పనిచేయవు

    1 month ago

    భారత్‌లో ప్ర‌తిరోజూ లక్షల్లో సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్‌లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై వంటి ప్రముఖ యాప్‌లు ఇకపై యూజర్ ఫోన్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ ఉండకపోతే పని చేయకుండా నియమాలు అమలులోకి రానున్నాయి.ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకొచ్చిన **“టెలికమ్యూనికేషన్ సైబర్‌ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025”**లో భాగంగా ప్రకటించబడింది. యాప్‌లు ఈ కొత్త ప్రమాణాలను అమలు చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చారు.

     

    సిమ్ బైండింగ్ తప్పనిసరి

    కొత్త నిబంధనల ప్రకారం, అన్ని మెసేజింగ్ యాప్‌లు తమ సేవలను యూజర్‌కు చెందిన యాక్టివ్ సిమ్ కార్డ్‌తో నిరంతరం అనుసంధానించాలి. అంటే, యూజర్ ఫోన్‌లో సిమ్ తీసివేస్తే లేదా నంబర్ డీయాక్టివేట్ చేస్తే యాప్ స్వయంగానే పని చేయదు. ఇలా చేయడం ద్వారా ఒకే ఫోన్‌లో, యాక్టివ్ సిమ్‌కు అనుసంధానమై ఉన్న సెషన్‌లను మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇదివల్ల నేరగాళ్లు రిమోట్‌గా యాప్‌లను దుర్వినియోగం చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

     

    కంప్యూటర్ లాగిన్లపై కూడా కొత్త నియంత్రణలు

    టెలికాం శాఖ (DoT) మరో కీలక ఆదేశం జారీ చేసింది:

    బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్ యాప్ ద్వారా లాగిన్ అయితే,
    ప్రతి 6 గంటలకు యూజర్‌ను ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలి.

    మళ్లీ లాగిన్ అవ్వాలంటే తప్పనిసరిగా QR కోడ్ స్కాన్ చేసి ధ్రువీకరించాలి.

    దీంతో యూజర్ ప్రతి సెషన్ కూడా ఒక యాక్టివ్ సిమ్‌కు బైండ్ అయి ఉంటుంది. నకిలీ నంబర్లతో లేదా పాత నంబర్లతో నేరగాళ్లు యాప్‌లను రిమోట్‌గా ఉపయోగించలేరని ప్రభుత్వం భావిస్తోంది.

     

    ఈ నిర్ణయం ఎందుకు?

    ప్రస్తుతం Yయాప్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మాత్రమే మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించడమే సరిపోతుంది. ఆ తర్వాత సిమ్ కార్డ్ తీసేసినా, డీయాక్టివేట్ చేసినా కూడా యాప్ పని చేస్తూనే ఉంటుంది.
    ఈ లోపాన్ని సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న స్కామర్లు, భారీ మొత్తంలో మోసాలకు ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.

    సెల్యులార్ ఆపరేటర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ప్రకారం, సిమ్ బైండింగ్ వల్ల యూజర్—నంబర్—డివైజ్ మధ్య సంబంధాన్ని ధృవీకరించడం సులభమవుతుందని ‘మీడియానామా’ వెల్లడించింది. బ్యాంకింగ్ మరియు యూపీఐ యాప్‌లలో ఇప్పటికే ఇదే పద్దతి అమలులో ఉంది.

     

    నిపుణుల అభిప్రాయాలు — మిశ్రమ స్పందన

    ఈ నిబంధనలపై సైబర్ నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

     

    సిమ్ ఆధారిత వెరిఫికేషన్ వల్ల మోసాలు కొందరికి తగ్గే అవకాశం ఉంది. యాప్‌లను విదేశాల నుంచి దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది.

     

    నేరగాళ్లు దొంగిలించిన / నకిలీ ఐడీలతో సిమ్‌లు తీసుకోవడం ఇంకా సులభమే అని అంటున్నారు. అసలు సమస్య అయిన సిమ్‌ జారీ అవుతున్న ప్రక్రియలోనే లోపాలు ఉన్నాయని వాదిస్తున్నారు. యూజర్లకు తరచూ లాగౌట్ కావడం, QR స్కాన్ చేయడం అసౌకర్యంగా మారవచ్చని సూచిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత, మెసేజింగ్ యాప్‌లు తమ సాఫ్ట్‌వేర్‌లో పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది. యూజర్లకు కూడా కొన్ని మార్పులు తప్పవు — ముఖ్యంగా డెస్క్‌టాప్ వాడే వారికి. సైబర్ నేరాలు తగ్గుతాయా లేదా అనేది రాబోయే నెలల్లోనే స్పష్టమవుతుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Allu Arha noble book of records : అల్లు అర్హకు అరుదైన గౌరవం: యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
    తర్వాత ఆర్టికల్
    High blood pressure : అధిక రక్తపోటు: ‘సైలెంట్ కిల్లర్’ గుండెపోటు ప్రమాదానికి ప్రధాన కారణం

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి