kntv
kntv

చైనా పర్యటనలో ఒమన్ సుల్తాన్- ఘన స్వాగతం పలికిన జిన్‌పింగ్

49 minutes ago

చైనాలో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు బీజింగ్‌లో ఘన స్వాగతం లభించింది. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కలిసి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. సుల్తాన్ చైనాలో చేపట్టిన తొలి అధికారిక పర్యటన ఇది.