kntv
kntv

గుడివాడలో టైడ్కో గృహాలు రుణమాఫీ చేయాలంటూ ధర్నా

2 months ago

గుడివాడ టిడ్కో కాలనీ లబ్ధిదారులు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ చౌక్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని, బ్యాంకుల నోటీసులు, వడ్డీ భారం, మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.